News

సీఎం మాటకు విలువ ఇచ్చి గౌరవిస్తున్నాం


సీఎం చంద్రబాబు మాటకు విలువ ఇచ్చి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని గౌరవిస్తున్నామని చంద్రదండు వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు అన్నారు. సీఎంపై జేసీ వ్యాఖ్యలు సరికాదని ఆయన హితవుపలికారు. బాబు కృషి వల్లే ఎన్నికల్లో గెలిచామన్నారు. దమ్ముంటే టీడీపీని వదిలి విడిగా పోటీ చేసి గెలవాలని జేసీకి ప్రకాష్ నాయుడు సవాల్‌విసిరారు. కాంగ్రెస్ హయాంలో తమపై దాడులు జరిగినా జేసీ దివాకర్‌రెడ్డి నోరు జారడం సరికాదని ప్రకాష్ నాయుడు అన్నారు.